అమరావతి-దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్! - ap government ready to establish defence cluster in amaravathi donakonda
12:41 February 05
అమరావతి-దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్!
అమరావతి- దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీని ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రానికి... రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు పంపింది. దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని పరిశ్రమల శాఖ తెలిపింది. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమలకు దొనకొండ అనువైన రాష్ట్ర కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.
లక్నోలో జరుగుతున్న ఫ్రెంచ్- ఇండో డిఫెన్స్ ఎక్స్ పోలో.. పరిశ్రమలశాఖ మంత్రి గౌతంరెడ్డి ఈ అంశాలను వెల్లడించారు. ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమల స్థాపనకు వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం కీలకమని స్పష్టం చేశారు. ఫ్రెంచ్ కంపెనీలతో కలసి పనిచేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండకు అతి చేరువలో ఉన్న కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి ఎగుమతి, దిగుమతులకు అవకాశముందని తెలిపిన గౌతమ్ రెడ్డి వివరించారు.
ఇవీ చదవండి.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని సీపీఐ తీర్మానం