ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 1, 2020, 8:34 AM IST

ETV Bharat / city

పేదల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

'నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు' పథకానికి సంబంధించిన నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ప్రభుత్వం ఇచ్చే ఉచిత స్థలంలో లబ్ధిదారు ఇల్లు నిర్మించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇళ్లు కట్టుకోవాలనే షరతు లేకుండా స్థలం ఎలా కేటాయిస్తారని ఇటీవల హైకోర్టు ఆక్షేపించటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ap government key decission housing sites
ap government key decission housing sites

పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి సంబంధించి నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు కేటాయించిన ఖాళీ ఇళ్ల స్థలాల విక్రయంపై నిషేధం విధిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వం కేటాయించిన ఉచిత ఇంటి స్థలంలో లబ్ధిదారులు కనీసం ఐదేళ్ల పాటు హక్కు కలిగి ఉండాల్సిందేనని జీవోలో పేర్కొంది. ప్రతి లబ్ధిదారు ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం ఈ మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్ల కాలపరిమితి తర్వాత మాత్రమే బదలాయింపు, విక్రయానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. పునః పరిశీలన అనంతరం ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం సూచించింది.

ABOUT THE AUTHOR

...view details