రాష్ట్రంలో నిత్యావసరాల వస్తువుల కొనుగోలు సమయాన్ని ప్రభుత్వం కుదించింది. ఉదయం ఆరు గంటల నుంచి 11 లోపు మాత్రమే ఉపశమనం కల్పించింది. ఆ తర్వాత ఎవరూ బయట తిరగొద్దని మంత్రి ఆళ్ల నాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిత్యవసరాలు, కూరగాయలను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి... ధరలు తెలిపే బోర్డులను దుకాణాల వద్ద ఏర్పాటు చేయాలని యజమానులకు సూచించారు. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా 1902 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని... అందుకే మళ్లీ రీ సర్వే చేసి అనుమానం ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి వెల్లడించారు.
చేపలు, రొయ్యల రైతుల కోసం ప్రత్యేక చర్యలు