రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్డినెన్స్ జారీ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. కరోనా ప్రభావం కారణంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అర్ధంతరంగా నిరవధిక వాయిదా వేసిన పరిస్థితిని రాష్ట్ర సర్కారు పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. వీటిపై ముఖ్యమంత్రి జగన్.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం తదితరులతో సమీక్షించారు. 2004లో బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. కరోనా వ్యాపిస్తోన్న ప్రస్తుత తరుణంలో పార్లమెంటు సమావేశాలే వాయిదా పడితే.. అసెంబ్లీని నిర్వహించగలమా అన్న చర్చ జరిగినట్లు తెలిసింది. అందువల్ల రెండు వ్యయాల కోసం ఆర్డినెన్స్ జారీ చేసి.. పరిస్థితులు కొలిక్కి వస్తే అప్పుడు శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడం బాగుంటుందేమోనన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం.
రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడితే