తెలుగు అకాడమీ పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు - సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు విడుదల చేశారు. అకాడమీ పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
NAME CHANGED: రాష్ట్ర తెలుగు అకాడమీ పేరు మారింది.. కొత్త పేరు ఏంటంటే..! - తెలుగు అకాడమీ పేరు తాజా వార్తలు
ap goevernment changed name of telugu academy
12:18 July 10
తెలుగు - సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
తెలుగు-సంస్కృత అకాడమీ యూజీసీ నామినీగా మురళీధర్‌శర్మను నియమించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా మురళీధర్‌శర్మ పని చేస్తున్నారు. అకాడమీ పాలకవర్గ సభ్యులుగా ప్రొ. డి.భాస్కర్‌రెడ్డి, నేరెళ్ల రాజ్‌కుమార్, ఎం.విజయశ్రీ, కప్పగంతు రామకృష్ణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి:
Last Updated : Jul 10, 2021, 2:50 PM IST