ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 6, 2021, 5:17 PM IST

ETV Bharat / city

'ఆ వైరస్ ఉన్నట్లు ఆధారాలు లేవు.. జనాన్ని భయపెట్టకండి'

రాష్ట్రంలో కరోనా ఎన్‌ 440కే వైరస్‌ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థరణ జరగలేదని రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్‌ కేఎస్‌ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం బి1.167, బి.1 వైరస్ స్ట్రెయిన్‌ల ప్రభావం దక్షిణ భారత దేశంపై ఎక్కువగా ఉందన్నారు.

ap covid control command chairman jawahar reddy
ap covid control command chairman jawahar reddy

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరూ.. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేయవద్దని రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్‌ కేఎస్‌ జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్‌ 440 కే వైరస్‌పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టత ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఈ వైరస్‌ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థరణ జరగలేదని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన పరిశోధన డేటా కూడా ఏమీలేదని జవహర్‌రెడ్డి వెల్లడించారు.

ప్రతీ నెలా సీపీఎంబీకి 250 నమూనాలు పంపుతామన్నారు. ఎన్ 440కె (బి.1.36) వైరస్ దక్షిణ భారత దేశం నుంచి వెళ్లిన నమూనాల్లో గుర్తించారని వెల్లడించారు. ఆ వైరస్ ప్రభావం గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కనిపించిందని.. ఇప్పుడు ఆ ప్రభావం చాలా స్వల్పమని పేర్కొన్నారు. ప్రస్తుతం బి1.167, బి.1 వైరస్ స్ట్రెయిన్‌ల ప్రభావం దక్షిణ భారతంపై ఎక్కువగా ఉందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details