కువైట్‌లో చిక్కుకున్న పశ్చిమ గోదావరి జిల్లా మహిళలపై ఈటీవీ భారత్ ప్రచురించిన 'జగనన్నా.. మమ్మల్ని అమ్మేశారు..కాపాడన్నా' కథనానికి స్పందన లభించింది. కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో ఉన్న మహిళలను... స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. తమ దీనావస్థను వివరిస్తూ.. బాధిత మహిళలు సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. ఈ వీడియోపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. వీడియో ఆధారంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను సీఎం జగన్ ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన 'దిశ' స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్.. బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కువైట్ ఎంబసీతో సంప్రదింపులు జరిపి... నలుగురు బాధిత మహిళలకు విముక్తి కల్పించారు. కువైట్ నుంచి స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. సీఎంవో స్పందనపై బాధిత మహిళల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. కువైట్‌లో చిక్కుకున్న మహిళలకు విముక్తి
కువైట్‌లో చిక్కుకున్న పశ్చిమ గోదావరి జిల్లా మహిళలకు విముక్తి లభించింది. మహిళలు తమ పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియో ఆధారంగా ముఖ్యమంత్రి కార్యాలయం చర్యలు చేపట్టింది. మహిళలను స్వగ్రామాలకు తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అధికారులు కువైట్ ఎంబసీ అధికారులతో మాట్లాడి.. మహిళలను ఏపీ తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.
కువైట్‌లో చిక్కుకున్న మహిళలకు విముక్తి