గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో రైతు రంగిశెట్టి వెంకటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. అమరావతి తరలిపోతుందన్న మనస్తాపంతో వెంకటేశ్వరరావు మృతిచెందినట్లు బంధువులు చెబుతున్నారు. గత 41 రోజులుగా రాజధాని ఆందోళనల్లో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులను తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు.
అమరావతి కోసం పోరాడి ఆగిన రైతు గుండె - ఏపీ రాజధానుల వార్తలు
అమరావతి కోసం మరో గుండె ఆగింది. కలల రాజధాని కళ్లెదుటే కూలిపోతుంటే ఆ కర్షకుడు తట్టుకోలేకపోయాడు. గుంటూరు జిల్లా నవులూరుకు చెందిన రైతు రంగిశెట్టి వెంకటేశ్వరరావు గుండెపోటుతో... ఈ తెల్లవారుజామున మృతిచెందారు. మృతుని బంధువులను నారా లోకేశ్ పరామర్శించారు.
అమరావతి కోసం ఆగిన రైతు గుండె