ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నవంబర్ 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - ఏపీ కేబినెట్ సమావేశం

నవంబర్ 4వ తేదీన రాష్ట్ర మంత్రవర్గ సమావేశం జరగనుంది. శాసనసభ నిర్వహణ, దిశ బిల్లులో మార్పులు, అసైన్డ్ భూములు లీజుకిచ్చే విషయం తదితర కీలక అంశాలపై కేబినెట్​లో చర్చ జరిగే అవకాశం ఉంది.

cabinet meeting
నవంబర్ 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

By

Published : Oct 28, 2020, 1:08 PM IST

నవంబర్ 4వ తేదీన రాష్ట్ర మంత్రవర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్​లో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ శాఖలు తమ ప్రతిపాదనలు పంపాల్సిందిగా సీఎస్ మెమోలో పేర్కొన్నారు. శాసనసభ నిర్వహణపైనా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దిశ బిల్లులో కేంద్రం సూచించిన మార్పు చేర్పులుపై కేబినెట్​లో చర్చించే అవకాశం ఉంది. అసైన్డ్ భూములను లీజుకు ఇచ్చే అంశంపైనా నిర్ణయం తీసుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details