మండలి ఛైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికమని వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి ఉభయసభలు దోహదపడాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏమైనా పొరపాట్లు చేస్తే సవరణలు చేయాలని పేర్కొన్నారు. మండలిలో మెజార్టీ ఉంటే తిరిగి పంపవచ్చని... అలా కాకుండా బిల్లును అడ్డుకోవడం ఏంటని ఎమ్మెల్సీలను ప్రశ్నించారు. ఈ సమయంలో శాసనమండలి అవసరమా అనే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.
'ఈ సమయంలో శాసనమండలి ఎందుకు..?' - ఏపీ అసెంబ్లీ తాజా వార్తలు
మూడు రాజధానుల బిల్లును మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపడంపై... వైకాపా ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మండలిలో జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. పెద్దలసభ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.
ap assembly sessions
.
Last Updated : Jan 23, 2020, 6:44 PM IST