ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి'

రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతం చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కొవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. మూడోదశ సన్నద్ధతపై ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.

andhra pradesh high court on corona
andhra pradesh high court on corona

By

Published : Jun 3, 2021, 2:14 PM IST

కొవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. 1.40 కోట్ల మందికి టీకా వేశామని ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని హైకోర్టు సూచించింది. మూడోదశ సన్నద్ధతపై ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. పడకలు, మందులకు కొరత లేకుండా చూడాలని ఆదేశించింది. అవసరమైన వైద్యసిబ్బందిని నియమించాలని పేర్కొంది.

రెండో దశలో ఎదుర్కొన్న సమస్యలను హైకోర్టు గుర్తు చేసింది. ప్రజాప్రతినిధులకు కొవిడ్ కమిటీల్లో స్థానం కల్పించాలని పిటిషనర్ కోరారు. పూర్తి వివరాలతో కేంద్ర, రాష్ట్రాలు అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా పడింది.

ఏ ప్రాతిపదికన ఇంజెక్షన్లు అందిస్తున్నారు..

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ మందుల బ్లాక్ మార్కెట్‌పై ఏం చర్యలు తీసుకున్నారని... ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరత, అత్యధిక ధరలకు అమ్మకాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీసింది. బ్లాక్‌మార్కెటింగ్‌ అడ్డుకునేందుకు ఇప్పటికే ఫ్లైయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్పింది. కేంద్రం సరిపడా ఇంజెక్షన్లు రావడం లేదని, 14 వందల మంది బ్లాక్‌ ఫంగస్ రోగులు ఉండగా 13 వేల ఇంజెక్షన్లు ఇచ్చారని వివరించింది.

ఒక్కో బ్లాక్ ఫంగస్ బాధితుడికి రోజుకు 3 ఇంజెక్షన్ల చొప్పున... 15 రోజులు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. మొత్తం 50 వేల ఇంజెక్షన్లు అవసరం ఉందని, ఈమేరకు ప్రైవేటుగా కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అవసరాలకు సరిపడా బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు ఎందుకు సరఫరా చేయలేకపోతున్నది, ఏ ప్రాతిపదికన రాష్ట్రాలకు అందిస్తున్నది చెప్పాలని... కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో.. మరో జాయింట్ కలెక్టర్ పోస్టు!

ABOUT THE AUTHOR

...view details