ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తండ్రిని చూడకుండానే వెనుదిరిగిన అమృత - MARUTHIRAO CREMATION UPDATES

తండ్రిని కడసారి చూసేందుకు వచ్చినా... చూడలేని పరిస్థితుల్లో అమృత వర్షిణి వెనుదిరగాల్సి వచ్చింది. శ్మశాన వాటికకు బందోబస్తు నడుమ వచ్చిన అమృతను మారుతీరావు మృతదేహాన్ని చూడనివ్వకుండా బంధువులు అడ్డుకోగా... చేసేదేమీలేక పోలీసు వాహనంలోనే వెళ్లిపోయింది.

amrutha-return-without-watching-maruthirao-dead-body
తండ్రిని చూడకుండానే వెనుదిరిగిన అమృత

By

Published : Mar 9, 2020, 3:04 PM IST

తండ్రిని చూడకుండానే వెనుదిరిగిన అమృత

తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని శ్మశానవాటికలో జరుగుతున్న మారుతీరావు అంత్యక్రియలకు అమృత హాజరైంది. మొదట వచ్చేందుకు నిర్ణయించుకున్న అమృత... బంధువుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో విరమించుకుంది. కట్​ చేస్తే.. పోలీసుల బందోబస్తు నడుమ శ్మశానవాటికకు చేరుకుంది.

తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన అమృతను బంధువులు అడ్డుకున్నారు. మృతదేహం వద్దకు రాకుండా అడ్డుగా నిలిచారు. "గోబ్యాక్ అమృత" నినాదాలతో శ్మశానవాటిక దద్దరిల్లిపోయింది. ఎంతసేపటికీ బంధువులు తన తండ్రిని చూసే అవకాశం కల్పించకపోవటం వల్ల తండ్రి మృతదేహాన్ని చూడకుండానే అమృత వెనుదిరిగింది.

ఇదీ చూడండి:మారుతీరావు అంత్యక్రియలకు అమృత దూరం...!

ABOUT THE AUTHOR

...view details