గత ముఖ్యమంత్రిపై కక్ష సాధింపులో భాగంగా రాజధానిని మార్చాలనుకోవడం సరైన నిర్ణయం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సీపీఐ 95వ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఏపీ రాజధాని మూడు ముక్కలాట కాకూడదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి రాజధాని ఓ అందమని అన్నారు. మొదటి నుంచి తాము అమరావతిలోని రాజధాని కొనసాగించాలని కోరుతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మూడు ముక్కలుగా రాజధానిని విభజించడం మంచి పద్ధతి కాదన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికకి ఎటువంటి అర్హత లేదని అభిప్రాయపడ్డారు. దానిని ఎవరూ పరిగణనలోకి తీసుకోరన్నారు. ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో... అదే జీఎన్ రావు కమిటీ నివేదికలో తెలిపారని ఆగ్రహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
'ఏపీ రాజధాని మూడు ముక్కలాట కాకూడదు'
ముఖ్యమంత్రి జగన్ రాజధానిని మూడు ముక్కలుగా చేయడం మంచి పద్ధతి కాదని సీపీఐ నేత నారాయణ అన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికకు ఎటువంటి అర్హత లేదని చెప్పారు. దానిని ఎవరూ పరిగణనలోకి తీసుకోరని అభిప్రాయపడ్డారు.
నారాయణ