వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినా... తమ ఆందోళనలను ఆపేది లేదని... రాజధాని రైతులు, మహిళలు తేల్చి చెబుతున్నారు. తమది న్యాయమైన డిమాండ్ అంటున్న రైతులు... సంఘీభావం తెలపాలని 13 జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలని వేడుకుంటున్నారు.
36వ రోజు అమరావతి రైతుల ఆందోళన
14:34 January 22
కొనసాగుతున్న ప్రజాందోళనలు
13:24 January 22
గుంటూరు: ప్రత్తిపాడులో బంద్ చేస్తున్న తెదేపా నాయకుల అరెస్టు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో బంద్ చేస్తున్న తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు వాహనంలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు తెదేపా నేతలు. వారిని అరెస్టు చేసి గుంటూరు వైపు తీసుకెళ్లారు పోలీసులు.
13:23 January 22
తెనాలిలో అమరావతి పరిరక్షణ సమితి రిలే దీక్షలు
తెనాలిలో అమరావతి పరిరక్షణ సమితి రిలే దీక్షలు చేపట్టింది. మండలిలో మహిళా సభ్యురాలిపై వైకాపా సభ్యుల తీరు బాధాకరమని ఆలపాటి రాజా అన్నారు. మంత్రులు మండలి ఛైర్మన్‌పైకి వెళ్లిన ఘనత వైకాపాకే చెల్లుతుందన్నారు.
13:03 January 22
గుంటూరులో రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు
గుంటూరులో రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిన్నా టవర్ కూడలి నుంచి హిమని సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. నిరసన ప్రదర్శనలో తెదేపా నేతలు నక్కా ఆనంద్‌బాబు, నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. 3 రాజధానుల ప్రకటన ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని తెదేపా నేతలు తెలిపారు.
13:01 January 22
మూడు రాజధానులకు వ్యతిరేకంగా ర్యాలీ
గుంటూరు జిల్లా బంద్‌లో భాగంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా...అమరావతి పరిరక్షణ సమితి,రాజకీయఐకాస నేతలు చేపట్టిన ర్యాలీ.... ..అరెస్టులకు దారితీసింది.గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి....... చేబ్రోలు హనుమయ్య ప్రాగణం వరకూ ర్యాలీ నిర్వహించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.బలవంతంగా వాహనాల్లో ఎక్కించారు.ఈ క్రమంలో.........ర్యాలీలో పాల్గొన్న తెలుగుదేశం నేతలు,పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రతిఘటన మధ్యే వారిని నల్లపాడు పోలీసు స్టేషన్ కి తరలించారు.
13:00 January 22
అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో బంద్
పోలీసు వాహనంలో ఎక్కి అమరావతి నినాదాలు చేస్తే..... కేసు పెట్టి రిమాండ్‌కు పంపిస్తానంటూ...... గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎస్సై అశోక్..... తెలుగుదేశం పార్టీ నాయకులపై మండిపడ్డారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు బంద్ నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ ,ప్రవేట్ సంస్థలు, దుకాణాలు మూసివేయాలని...., రాజధానికి సహకరించాలని నాయకులు కోరుతూ ఉన్నారు. అదే సమయంలో హుటాహుటిన నాయకుల వద్దకు వచ్చిన ఎస్సై అశోక్..... వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తమాషాగా ఉందా... ఎన్ని సార్లు చెప్పాలంటూ మండిపడ్డారు. నాయకులను అరెస్ట్ చేసి జీపులో ఎక్కించారు. వాహనంలో కూర్చున్నవారు జై అమరావతి అంటూ నినాదాలు చేయడంపై ఎస్సై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు పెట్టి రిమాండ్‌కి పంపిస్తానంటూ బెదిరించారు..
10:43 January 22
గుంటూరు జిల్లా వ్యాప్తంగా బంద్
తెనాలిలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మూసివేసి బంద్ చేస్తున్నారు. పెదకాకానిలో ఐకాస ఆధ్వర్యంలో బంద్ సందర్భంగా.. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేశారు. పొన్నూరులో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు.
10:40 January 22
'ముఖ్యమంత్రి జగన్.. రాజీనామా చేయాలి'
సీఎం రాజీనామా చేయాలంటూ మందడం దీక్షా శిబిరంలో రైతులు, మహిళల నినాదాలు చేశారు. 3 రాజధానుల బిల్లు ఆగాలని చేయని పూజలు లేవు, మొక్కని దేవుళ్లు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పూజలు ఫలించి ఇవాళ మండలిలో బిల్లు ఆగాలని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ ఒక్కరోజు బిల్లు ఆగితే న్యాయపరంగా చేయాల్సిన పోరాటం చేస్తామని చెప్పారు.
10:38 January 22
చిలకలూరిపేటలో బంద్
చిలకలూరిపేటలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. 3 రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ బంద్ చేస్తున్నారు. దుకాణాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి చేశారు.
09:47 January 22
బంద్‌కు అనుమతిలేదు: ఎస్పీ
బంద్‌కు ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ, గ్రామీణ ఎస్పీ విజయరావు తెలిపారు. బంద్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, ఆందోళనకారులు దుకాణాలు, పాఠశాలలు బలవంతంగా మూయించవద్దని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
09:35 January 22
గుంటూరు బృందవన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
గుంటూరు బృందవన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద తెదేపా నేత జీవీ ఆంజనేయులుతో పాటు పలువురు నేతలు ఆందోళన చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కారణంగా.. ఉద్రిక్తత నెలకొంది.
08:27 January 22
మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరులో నిరసన ప్రదర్శనలు
మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరులో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. గుంటూరు జిల్లా బంద్‌లో భాగంగా విద్యార్థి యువజన ఐకాస ఆధ్వర్యంలో నిరసన చేశారు. గుంటూరు ఎన్టీఆర్ బస్ కూడలి వద్ద ఆందోళన చేపట్టారు విద్యార్థి సంఘాలు. విద్యార్థి సంఘాలు కళాశాల, పాఠశాల బస్సులను అడ్డుకున్నారు.3 రాజధానుల ప్రకటన ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
08:26 January 22
ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం
రాజధాని గ్రామాల్లో వరుసగా రెండో రోజు బంద్ కొనసాగుతోంది. దుకాణాలు తెరవకుండా స్వచ్ఛందంగా వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. రాజధాని తరలింపు అగుతుందనే నమ్మకంతో ఉన్నామని రైతులు అంటున్నారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తేల్చి చెప్పారు.
07:48 January 22
3 రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరులో నిరసనలు
3 రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరులో విద్యార్థి యువజన ఐకాస ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. జిల్లా బంద్‌లో భాగంగా విద్యార్థి యువజన ఐకాస ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కూడలి వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వం వింత పోకడలు ప్రదర్శిస్తోందని ఆగ్రహించారు. కళాశాల, పాఠశాల బస్సులను అడ్డుకున్నారు. 3 రాజధానుల ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
07:45 January 22
రాజధాని అమరావతిలో మరో రైతు మృతి
రాజధాని అమరావతిలో మరో రైతు మృతి చెందాడు. తుళ్లూరు మండలం అనంతవరంలో కొమ్మినేని పిచ్చయ్య (72) చనిపోయాడు. రాజధాని వ్యవహారంలో మనస్థాపానికి గురై గుండెపోటుతో మృతిచెందినట్లు బంధువులు చెప్పారు.
07:31 January 22
36వ రోజుకు అమరావతి రైతుల ఆందోళన
అమరావతి రైతుల ఆందోళన 36వ రోజుకు చేరింది. కృష్ణా, గుంటూరు జిల్లాల బంద్‌కు ఐకాస పిలుపునిచ్చింది. అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందినందుకు నిరసనగా బంద్ చేస్తున్నారు. పోలీసులకు పూర్తిగా సహాయ నిరాకరణ కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. పోలీసులు అడ్డుకుంటే ఎక్కడికక్కడ జాతీయ జెండాలతో నిరసనలు తెలపాలని నిర్ణయించారు. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు కొనసాగించనున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో 36వ రోజు రైతు రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో రైతుల నిరసన, మహిళలు పూజలు చేయాలని నిర్ణయించగా.. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర గ్రామాల్లో రైతు నిరసనలు ఇవాళ మరింత ఉద్ధృతం కానున్నాయి. అమరావతితో పాటు.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజాసంఘాలు, రాజకీయపక్షాల ఆందోళనలకు సిద్ధమయ్యాయి.