రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో ప్రజాందోళనలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. కరోనా విషయంలో ప్రధాని మోదీ సూచనలను పాటిస్తూనే ఆందోళన కొనసాగిస్తామని మందడం రైతులు స్పష్టం చేశారు. మోదీ సూచనల మేరకు రేపు జనతా కర్ఫ్యూ పాటిస్తూ నిరసన చేస్తామన్నారు. తమ ఆందోళనలను ప్రధాని గౌరవించి తను శంకుస్థాపన చేసిన అమరావతినే... రాష్ట్ర రాజధానిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. దీక్షా శిబిరంలో ముఖానికి మాస్కులు ధరించి 3 మీటర్ల దూరంగా కూర్చుని రైతులు, మహిళలు నిరసన చేపట్టారు.
మాస్కులు ధరించి.. 3 మీటర్ల దూరం పాటించి..! - అమరావతి రైతుల ఆందోళన
కరోనా విషయంలో ప్రధాని సూచనలు పాటిస్తూనే.. అమరావతి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖానికి మాస్కులు వేసుకుని.. ఒకరి నుంచి ఒకరు 3 మీటర్ల దూరంగా కూర్చుని మందడంలో నిరసన చేపట్టారు.
అమరావతి రైతుల ఆందోళన