రాజధాని ఉద్యమంలో మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని తరలిపోతోందనే బాధతో నీరుకొండకు చెందిన మాదాల సుధాకర్ గుండెపోటుతో మృతి చెందారు. అమరావతి నిర్మాణానికి రైతు తనకున్న ఎనిమిది ఎకరాల పొలాన్ని భూసమీకరణ కింద ప్రభుత్వానికి ఇచ్చారు. అమరావతి నిర్మాణం కోసం భూమిలిచ్చిన రైతుల ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వం స్పందించటం లేదని పలువురు వాపోతున్నారు.
అమరావతి ఉద్యమం: ఆగిన మరో రైతు గుండె - అమరావతి తాజా వార్తలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. 362 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఆ నేపథ్యంలో నీరుకొండకు చెందిన ఓ రైతు గుండెపోటుతో చనిపోయారు.
ఆగిన మరో రైతు గుండె
ఇదీ చదవండి:
Last Updated : Dec 14, 2020, 4:32 PM IST