పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగబాబుకు.. ఆయన మేనల్లుడు అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. ప్రజాసేవలో మొదటి అడుగు వేసిన నాగబాబుకు.. అంతా జయమే కలగాలని ఆకాంక్షించారు. ప్రత్యక్షంగా రాజకీయాల్లో నాగబాబు వెంట లేకున్నా... తమ శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయని సందేశం పంపారు. ప్రజాసేవలో తన మామయ్యకు నైతికంగా అండగా ఉంటామని చెప్పారు.
నాగబాబుకు మద్దతు.. పవన్‌కు శుభాకాంక్షలు @ బన్నీ! - face book
మేము ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినప్పటికీ... మీకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది- అల్లు అర్జున్
నాగబాబుతో పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కూ అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పారు. జనసేన రాజకీయ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులను పవన్ తప్పక తీసుకువస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. పవన్‌కు మంచి విజన్ ఉందని.. ఆయన డైనమిక్ నాయకుడని అన్నారు.