ముఖ్యమంత్రి ప్రధాన సలహదారు అజేయకల్లం నేతృత్వంలో సచివాలయంలో జాయింట్ కలెక్టర్ల సదస్సు జరిగింది. జాయింట్ కలెక్టర్లు భూ వివాదాల పరిష్కారంలో శ్రద్ధ చూపించటం లేదని సదస్సులో అజేయకల్లం స్పష్టం చేశారు. రైతులంతా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయని వ్యాఖ్యానించారు. 22 ఏ నుంచి ప్రైవేట్ భూములను పూర్తిగా తొలగించాలన్నారు. వివాదంలో ఉన్న భూములపై తక్షణం దృష్టి పెట్టాలని జేసీలను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టనున్న రీసర్వే కంటే ముందే వెబ్ ల్యాండ్లోని తప్పులను సరిదిద్దాలని సూచించారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పుల సవరణకు తహసీల్దార్లు, వీఆర్వోలు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పారు. జేసీల సదస్సుకు రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు హాజరయ్యారు. అనంతపురం- అమరావతి ఎక్స్ప్రెస్ హైవే భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు. రహదారి ప్రాజెక్టులపై వివాదాలు తలెత్తితే తక్షణం పరిష్కరించాలని రహదారులు భవనాల శాఖ కార్యదర్శి జేసీలకు స్పష్టం చేశారు.
భూ వివాదాలపై ప్రత్యేక దృష్టి: అజేయ కల్లం - భూ వివాదాల సమస్యలపై జేసీలతో అజేయ కల్లం భేటీ
ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం నేతృత్వంలో జరిగింది. భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ ఈ సదస్సును ఏర్పాటు చేసింది. వివాదంలో ఉన్న భూములపై అధికారులు తక్షణం దృష్టి పెట్టాలని సూచించారు. జేసీలకు భూ పరిష్కారాల్లో శ్రద్ధ చూపాలని తెలిపారు.
భూ వివాదాల సమస్యలపై జేసీలతో అజేయ కల్లం భేటీ
Last Updated : Aug 8, 2019, 11:35 PM IST