తెలంగాణ వరంగల్ గ్రామీణ జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. ఖానాపురం మండల కేంద్రం సమీపంలోని 365 జాతీయ రహదారిపై వెళ్తున్న గొర్రెల మందపై నుంచి లారీ దూసుకుపోవడం వలన 250 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు తమ గొర్రెలను మేపుకోవడం కోసం ఆరునెలల క్రితం కొత్తగూడ మండలంలోని మన్యం వెళ్లారు. తమ గ్రామంలో వరికోతలు పూర్తవుతుండడం వల్ల రాత్రి సమయంలో రవాణ వ్యవస్థ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఇంటికి బయలుదేరారు. రాత్రి దాదాపు రెండు గంటల సమయంలో ఖానాపురం మండలం-నర్సంపేట మధ్యలో ఉన్న బ్రిడ్జి పైకి గొర్రెలు వచ్చే సమయానికే వెనుక నుంచి మట్టి లారీ గొర్రెల మందపై నుంచి దూసుకుపోయింది.
తెలంగాణలో రోడ్డు ప్రమాదం... 250 గొర్రెలు మృతి - accident in warangal rural district
తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ... 250 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి.
తెలంగాణలో రోడ్డు ప్రమాదం... 250 గొర్రెలు మృతి
ఆ సమయంలో దాదాపు ఆరువందల గొర్రెలు ఉండగా... అందులో 250 వరకు మృతి చెందాయని... మరో యాభై లేవలేని స్థితిలో ఉన్నాయని గొర్రెల కాపరులు తెలిపారు. దాదాపు పద్దెనిమిది లక్షల వరకు నష్టం ఉంటుందని... తమకు ఈ గొర్రెలు తప్ప మరో ఆధారం లేదని గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెల మందలో సూడి గొర్రెలు ఉన్నాయని... లారీ ఢీకొట్టడం వలన కడుపులో నుంచి పిల్లలు బయటపడ్డాయని వారు విలపించారు.
ఇవీ చూడండి: పొలంలో కరెంట్ షాక్తో రైతు మృతి