కార్మికులు విధులకు రాకపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు వద్ద పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రాత్రి స్పిల్ వే వద్ద పని చేస్తూ బిహార్ కు చెందిన మహమ్మద్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు.
ఈ ఘటనకు నిరసనగా ప్రాజెక్టు వద్ద కార్మికులు విధ్వంసం సృష్టించారు. రెండు వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారిని శాంతింపజేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద పనులను అధికారులు నిలిపివేశారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి పంపారు.