ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యువకుడి నగ్న వీడియోలతో రూ.2 లక్షలు వసూలు..! - Facebook cheating news

ఫేస్​బుక్​ పరిచయం ఓ యువకుడిని నిలువునా ముంచింది. ఆన్​లైన్​లో పరిచయం కాస్త వాట్సాప్​ చాటింగ్​కు మారింది. తర్వాత వీడియో కాల్స్... అలా మొదలై... నగ్న వీడియోలు షేర్ చేసుకునే దాకా వెళ్లింది. యువకుడిని ట్రాప్ చేసిన సదురు యువతి రూ. 2 లక్షలు వసూల్ చేసింది. మరింత డబ్బు డిమాండ్ చేయగా.. మోసం బయటకొచ్చింది.

young woman cheating young man
యువకుడి వీడియోలతో బెదిరింపులు

By

Published : Mar 13, 2021, 7:47 PM IST

ఫేస్​బుక్​లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్​ అంగీకరించి రూ. రెండు లక్షలు పోగొట్టుకున్నాడు హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు. అంతటితో ఆగకుండా బాధితుడికి బెదిరింపులు ఎదురయ్యాయి. మోసపోయానని తెలుసుకున్న ఆ యువకుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

ఫేస్​బుక్​లో రాజస్థాన్​కు చెందిన ఓ యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగా.. సదురు యువకుడు యాక్సెప్ట్ చేశాడు. ఇరువురు వాట్సాప్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. పరిచయం కాస్త శ్రుతి మించింది. యువతి.. యువకుడికి వాట్సాప్​లో వీడియో కాల్ చేసి తన దుస్తులను తొలగించేది. సదురు యువకుడిని కూడా దుస్తులను తొలగించమని కోరేది. అలా దుస్తులు తీసేసిన తర్వాత... తతంగాన్నంతా రికార్డు చేసేది. ఈ వీడియోలను యువకుడికి చూపి బ్లాక్ మెయిల్​కు దిగింది. ఇప్పటివరకు రూ. 2లక్షలు వాసులు చేసిందని బాధిత యువకుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంకా బ్లాక్ మెయిల్ చేయగా.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పుకొచ్చాడు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. .

ABOUT THE AUTHOR

...view details