ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SUICIDE ATTEMPT: పోడు సమస్య..అధికారుల తీరుతో ఆత్మహత్యాయత్నం - telangana news 2021

తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు సమస్య రగులుతూనే ఉంది. ఖమ్మం ఘటన మరువక ముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలంలో అటవీ అధికారుల తీరుతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు.

పోడు సమస్య..అధికారుల తీరుతో ఆత్మహత్యాయత్నం
పోడు సమస్య..అధికారుల తీరుతో ఆత్మహత్యాయత్నం

By

Published : Aug 14, 2021, 7:28 PM IST

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన రైతు భూక్య హుస్సేన్​ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాను సాగు చేసుకుంటున్న భూమిలో అటవీ అధికారులు మొక్కలు నాటుతున్నారనే మనస్తాపంతో పురుగుల మందు తాగాడు.

పాండురంగాపురం గ్రామానికి చెందిన భూక్య హుస్సేన్ బూర్గంపాడు మండలం ఉప్పుసాకలో గల సర్వే నెంబర్​ 90లో 10 ఎకరాల భూమిని చాలా కాలం నుంచి సాగు చేసుకుంటున్నాడు. అయితే ఈ భూమి విషయంలో భూక్య హుస్సేన్​కు, అటవీ అధికారులకు మధ్య గతంలో వివాదం తలెత్తగా.. భూక్య హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ కేసు హైకోర్టులోనే ఉంది.

ఇదిలా ఉండగా.. నేడు అటవీ శాఖ అధికారులు ఆ భూమిలో జామాయిల్​ మొక్కలు నాటేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న భూక్య అక్కడికి చేరుకున్నాడు. ఈ భూమికి సంబంధించి హైకోర్టులో కేసు ఉందని.. మొక్కలు నాటొద్దని అధికారులను కోరాడు.

భూక్య హుస్సేన్​ మాటలు పట్టించుకోని అటవీ అధికారులు.. భూమిలో మొక్కలు నాటారు. దీంతో మనస్తాపం చెందిన అతడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు స్థానికుల సహాయంతో పాల్పంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:VIVEKA MURDER CASE: సీబీఐ విచారణకు ఉదయ్​కుమార్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి హాజరు

ABOUT THE AUTHOR

...view details