ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM

.

ap TOP NEWS
ap TOP NEWS

By

Published : Jun 22, 2022, 8:59 PM IST

  • అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. 1000 దాటిన మృతులు
    అఫ్గానిస్థాన్​లో సంభవించిన భూకంపానికి వెయ్యి మంది బలయ్యారు. మరో 1,500 మంది గాయపడ్డారు. 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'పదవి కోసం వెంపర్లాడను.. రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది'
    ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయని.. వాటి కోసం పోరాటం చేయబోనని పేర్కొన్నారు. తన తర్వాత కూడా శివసేన నాయకుడే సీఎం అయితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

    అమ్మఒడి లబ్ధిదారులకు ప్రభుత్వం షాక్​
    రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "అమ్మ ఒడి' పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ ఏడాది లక్షమందికి పైగా లబ్ధిదారులను అనర్హులుగా తేల్చింది..!. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్​లో వాళ్లే !
    ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సంవత్సరంలో 54, రెండో సంవత్సరంలో 61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఉత్తీర్ణత శాతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా తొలిస్థానంలో ఉండగా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'సీఎం జగన్.. నయా తుగ్లక్​గా వ్యవహరిస్తున్నారు'
    అమరావతి రైతుల పోరాటానికి అండగా ఉంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి బినయ్ విశ్వం స్పష్టం చేశారు. దేశంలో ఎక్కాడా లేని విధంగా సీఎం జగన్​ మూడు రాజధానులంటూ.. ఆధునిక తుగ్లక్​గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆత్మకూరు ఉపఎన్నికకు సర్వం సిద్ధం
    నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. మొత్తం 278 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జమ్ముకశ్మీర్​లో వరదలు.. చిక్కుకున్న 11 మంది పర్యటకులు
    జమ్ముకశ్మీర్​లో వరదలు సంభవించాయి. పహల్​గామ్​లో 11మంది పర్యటకులు, ఇద్దరు టూరిస్ట్ గైడ్​లు వరదల్లో చిక్కుకున్నారు. భారీ వర్షాల ధాటికి పలు జాతీయ రహదారులు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మార్కెట్లకు భారీ నష్టాలు.. సెన్సెక్స్​ 700 పాయింట్లు డౌన్
    స్టాక్​ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 709 పాయింట్లు కోల్పోయి 51,822 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225 పాయింట్లు పతనమై 15,413కి పడిపోయింది. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులున్నప్పటికీ.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రోహిత్​, కోహ్లీలకు బీసీసీఐ స్ట్రాంగ్​ వార్నింగ్​!
    భారత్​-ఇంగ్లాండ్​ మధ్య జరగనున్న ఐదో టెస్టు కోసం ఇంగ్లాండ్​ వెళ్లిన టీమ్​ఇండియా ఆటగాళ్లు రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీలకు బీసీసీఐ వార్నింగ్​ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కార్మికులకు వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సిద్ధం'
    సినీ కార్మికుల సమ్మె, వేతనాలు పెంపుపై నిర్మాతల మండలి స్పందించింది. కార్మికులకు వేతనాలు పెంచడానికి తమకెలాంటి ఇబ్బంది లేదని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details