- పాఠశాలల పునఃప్రారంభం తేదీలో మార్పు
రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం జూలై 4న తెరుచుకోవాల్సిన బడులు జూలై 5న తెరుచుకోనున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరికి ఘన నివాళి అర్పించేందుకు ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేస్తున్నట్ల ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రహదారుల మరమ్మతులపై జగన్ ఆదేశం: మంత్రి సురేశ్
రోడ్ల మరమ్మతులు, బ్రిడ్జిలు, ఆర్వోబీల నిర్మాణాలను వచ్చే నెల 15 లోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విశాఖలో స్థలాల విక్రయంపై హైకోర్టు స్టే
విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో ఓపెన్ ప్లాట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన వేలం ప్రకటనపై హైకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఇంకా సమయం ఉంది.. ఏ నిర్ణయమూ తీసుకోలేదు'
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై సీఎం జగన్ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.., పార్టీలో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా..
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ మాజీ నేత యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశంలో ఈమేరకు ఏకాభిప్రాయం కుదిరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అగ్నిపథ్‌పై తగ్గేదే లేదు.. ఆ విషయంలో మోదీకి సాటిలేరు'
'అగ్నిపథ్'పై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ స్పందించారు. సైన్యంలో చేపట్టాల్సిన సంస్కరణల్లో భాగంగానే అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చైనా కీలక ప్రయోగం విజయవంతం
మధ్యంతర దశలో (మిడ్‌కోర్స్) అస్త్రాన్ని నేలకూల్చే యాంటీబాలిస్టిక్ క్షిపణి (ఏబీఎం)కి సంబంధించిన సాంకేతిక పరీక్షను చైనా విజయవంతంగా నిర్వహించింది. ఇది పూర్తిగా రక్షణాత్మక చర్య అని, ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకొని నిర్వహించింది కాదని చైనా రక్షణ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆమె'గా మారిన ఎలాన్ మస్క్ కుమారుడు
టెస్లా అధినేత కుమారుడు తన పేరును మార్చుకోనున్నారు. ఇప్పటికే లింగమార్పిడి చేసుకోగా తాజాగా ఆమెగా మారిన నేపథ్యంలో.. పేరును మార్చాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టాప్ 10లో భారత్ నుంచి స్మృతి మంధాన మాత్రమే!
మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). టాప్ 10 బ్యాటర్ల జాబితాలో టీమ్ఇండియా నుంచి స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మాత్రమే నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆమెతో చైతూ డేటింగ్!'.. 'ఎదగండి అబ్బాయిలూ..' అంటూ సమంత ట్వీట్
హీరోయిన్ సమంత.. తనను ట్రోల్ చేసేవారికి గట్టి సమాధానమిచ్చింది. తనను విమర్శించడం మానేసి పని, కుటుంబం మీద దృష్టి పెట్టాలని సమాధానమిచ్చింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9pm top news