ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9pm - ఏపీ తాజా వార్తలు

.

top news
ప్రధాన వార్తలు

By

Published : May 20, 2020, 9:02 PM IST

  • షాక్​ కొట్టాలి..

రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై భారీ జరిమానాలు వేయడం సహా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • స్పందించింది

ఏపీ ఫిర్యాదుపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. ఏపీ ఫిర్యాదులో పేర్కొన్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సీఐడీ నోటీసులు

విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించి.. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పలువురికి సీఐడీ నోటీసులిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వణికిస్తోన్న 'అంపన్​'

అతి తీవ్ర తుపాను అంపన్.. తీరం దాటే సమయంలో బంగాల్​, ఒడిశాలను వణికించింది. భీకర గాలులు, కుండపోత వర్షాలతో విరుచుకుపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొందరికే అవసరం

దేశంలో ఉన్న కరోనా రోగుల్లో 6.39శాతం మందికే ఆస్పత్రుల్లో చికిత్స అవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా క్యాష్​ను మార్చింది

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కరెన్సీతోనూ వైరస్ సోకుతుందేమోనన్న భయాలు ఏర్పడుతున్నాయి. దీంతో నగదు రహిత లావాదేవీలు కాస్త ఊపందుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గౌరవ సూచిక

అమెరికా అత్యధిక సంఖ్యలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అందుకే అత్యధిక సంఖ్యలో కేసులు గుర్తించామని... ఇది తమకు గౌరవ సూచికని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోచ్ కాదు

టీ20 ఫార్మాట్లో విజయవంతమైన కోచ్​గా మారాలంటే అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన అనుభవం అవసరం లేదంటున్నాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మీరే నా బలం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుధవారం తన 37వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పెద్దఎత్తున సామాజిక మాధ్యమాల్లో అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆస్కార్ వాయిదా..!

కరోనా వైరస్ కారణంగా ఆస్కార్ అవార్డులు వాయిదా పడనున్నాయని తెలుస్తోంది. ఫిబ్రవరి 28, 2021న జరగాల్సిన ఈ పురస్కార వేడుకను వాయిదా వేయాలని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్​ అండ్ సైన్సెస్ భావిస్తోందట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details