ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @7PM

.

7pm Top news
ప్రధాన వార్తలు 7PM

By

Published : Oct 29, 2021, 7:00 PM IST

  • నేత్రదానం చేసిన పునీత్​ రాజ్​కుమార్
    గుండెపోటుతో మరణించిన పునీత్​ రాజ్​కుమార్​.. నేత్రదానం చేశారు. ఈ నిర్ణయం పట్ల అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. నటుడ్ని కొనియాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మంగళగిరి కోర్టు వివరణపై హైకోర్టు అసంతృప్తి
    తెదేపా నేత బ్రహ్మంచౌదరి కేసులో(TDP Leade Brahmam Case news) గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు.. హైకోర్టుకు మంగళగిరి కోర్టు వివరణ ఇచ్చింది. ఈ నివేదికపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దుర్మార్గానికి ఎదురొడ్డుతాం: చంద్రబాబు
    "మేం న్యాయానికి తల ఒగ్గుతాం.. దుర్మార్గానికి గుండె చూపుతాం" అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా.. నిర్వహించిన బహిరంగ సభలో బాబు మాట్లాడారు. రాష్ట్రాన్ని పాలించే అర్హత వైకాపా ప్రభుత్వానికి లేదన్న చంద్రబాబు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బద్వేలు సమరానికి సర్వం సిద్ధం
    బద్వేలు ఉప ఎన్నిక( Badvel by-election)కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్(State Chief Electoral Officer Vijayanand) తెలిపారు. బద్వేలు నియోజకవర్గానికి ఉన్న అన్ని సరిహద్దులనూ మూసివేశామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అల్పపీడన ప్రభావంతో.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
    అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు-శ్రీలంక తీరాలను ఆనుకుని నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మోదీ మళ్లీ పీఎం అవ్వాలంటే.. యోగి సీఎం కావాల్సిందే'
    2024 ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మళ్లీ ఎన్నిక కావాలంటే.. 2022 ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎంగా యోగి ఆదిత్యానాథ్​ గెలుపొందాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah News) వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • డీఆర్​డీఓ ఘనత- 'లాంగ్​రేంజ్ బాంబ్' ప్రయోగం సక్సెస్
    సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగల, దేశీయంగా అభివృద్ధి చేసిన బాంబును(లాంగ్ రేంజ్ బాంబ్) భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, భారత వైమానిక దళం సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేయడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫేస్​బుక్ పేరు మార్పుతో మనకేంటి లాభం?
    మెటావర్స్​తో సరికొత్త సాంకేతిక యుగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిపారు ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్. ఫేస్​బుక్ మాతృసంస్థ పేరును మెటావర్స్​(facebook new name)గా మార్చుతున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జియోఫోన్ నెక్స్ట్ ధర ఇలా.. ఈఎంఐ ఆప్షన్​ కూడా...
    వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న జియోఫోన్ నెక్స్ట్​​ (JioPhone Next Price) ధరను ప్రకటించింది జియో సంస్థ. ఈ ఫోన్​ ధర రూ.6,499గా నిర్ణయించింది. ఈ ఏడాది దీపావళి నుంచి మార్కెట్​లోకి రానున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పురుషుల జట్టుకు మహిళా కోచ్.. చరిత్రలో తొలిసారి!
    క్రికెట్​ చరిత్రలో తొలిసారి ఫ్రాంచైజీ క్రికెట్​లో ఓ మహిళా క్రికెటర్​ పురుషుల జట్టుకు కోచ్​గా బాధ్యతలు స్వీకరించనుంది. టీ10 లీగ్ ఐదో సీజన్​​ నేపథ్యంలో ఈ కీలక ప్రకటన చేసింది టీమ్​ అబుదాబి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details