ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

3రోజుల్లో రాష్ట్రంలో 47వేల మందికి టీకా...చాలాచోట్ల వ్యాక్సినేషన్‌కు స్పందన కరవు - Covid Vaccination news

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ మూడోరోజూ సాఫీగా సాగింది. సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా 14వేల 606 మంది టీకా వేయించుకున్నారు. టీకా పంపిణీ ప్రారంభమైన రోజున 19 వేల108 మంది, రెండోరోజు 13,306 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. చాలా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న వారి నుంచి స్పందన కరవైంది.

3rd Day Covid Vaccination in AP
కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

By

Published : Jan 19, 2021, 4:14 AM IST

Updated : Jan 19, 2021, 4:59 AM IST


కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమం.... మూడో రోజు కొనసాగింది. మొత్తంగా మూడు రోజుల్లో 47 వేల 20మంది టీకా తీసుకున్నారు. ఒక్కో కేంద్రంలో వంద మందికి చొప్పున టీకా అందించేలా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదివారం గైర్హాజరైన వారికీ ఇవ్వాలని నిర్ణయించారు. గరిష్ఠంగా నెల్లూరు జిల్లాలో 1,847, కనిష్టంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 458 మంది టీకా వేయించుకున్నారు. సోమవారం టీకా తీసుకున్న వారిలో.... ఎవరిలోనూ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేనితెలిపారు.

నమోదు చేసుకున్నారు..కానీ రాలేదు

చాలా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న వారి నుంచి.... స్పందన లోపించింది. విజయవాడ జీజీహెచ్​లో 1300 మంది ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఉండగా..వీరిలో పీజీలతో కలుపుకొని 300 మంది వైద్యులున్నారు. 117 మందికి ఎస్ఎమ్ఎస్​లు పంపగా.. 3రోజుల్లో 57 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. పెనమలూరు పీహెచ్‌సీలో మూడు రోజులకు కలిపి 331 మందికి టీకా ఇవ్వాల్సి ఉండగా 227 మందికి వేశారు. కంచికచర్ల పీహెచ్‌సీలో టీకా కోసం 100 మంది పేర్లు నమోదు చేసుకోగా వారిలో 87 మంది మాత్రమే స్పందించారు. మిగిలిన వారిలో గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఉన్నారు. పామర్రు పీహెచ్‌సీలో వంద మందికి 65 మంది మాత్రమే స్పందించారు. గుంటూరు జీజీహెచ్‌లో శని, ఆదివారాల్లో 11 మంది వైద్యులు, ఇతర కేటగిరిల్లో ఉండే సిబ్బంది 31 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు.

అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఓ టీకా కేంద్రంలో.. రోజుకు 100 మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. తొలిరోజు 41 మంది, ఆదివారం రోజున 11, సోమవారం 83 మంది తీసుకున్నారు. టీకా కోసం పేరు నమోదు చేసుకున్న వారు రాకపోవడంతో సిబ్బంది గంటల తరబడి నిరీక్షించారు.

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో ఎయిమ్స్‌ సంచాలకుడు డాక్టర్ ముఖేష్ త్రిపాఠి టీకా వేయించుకున్నారు. కొవిడ్ టీకా అత్యంత సురక్షితమైందని..వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో భాజపా ఆటలు సాగవు: మంత్రి కొడాలి నాని

Last Updated : Jan 19, 2021, 4:59 AM IST

ABOUT THE AUTHOR

...view details