ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు 3PM

.

3pm_Topnews
ప్రధాన వార్తలు 3PM

By

Published : Apr 5, 2021, 3:01 PM IST

  • కృష్ణపట్నం పోర్టులో అదానీ గ్రూప్‌ 100% పెట్టుబడులు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టును అదానీ పోర్ట్స్ లిమిటెడ్ వంద శాతం వశం చేసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పోర్టులో 27 శాతం వాటా ఉన్న అదానీ పోర్ట్స్‌ లిమిటెడ్‌.. విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25 శాతం వాటాను 2వేల 800 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. మొత్తంగా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అదానీ పోర్ట్స్ చేతుల్లోకి మారినట్లైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నష్టాలు ఉక్కు పరిశ్రమతో కాదు.. ప్రపంచ వ్యాప్త పరిణామాలతోనే..'

పరిశ్రమల కారణంగా నష్టాలు రావట్లేదని విశాఖ ఉక్కు ఉద్యోగులు వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్త పరిణామాల కారణంగానే నష్టాలు వాటిల్లుతున్నాయని చెప్పారు. ఉక్కు పరిశ్రమలన్నీ కలిపి మెగా సంస్థగా ఏర్పాటు చేసేందుకు తీర్మానించినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పవన్​ను చూసి వైకాపా భయపడుతోంది: పోతిన మహేష్

తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ ప్రభావాన్ని చూసి వైకాపాకు వెన్నులో వణుకు పుట్టిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. వారిని ఓటమి భయం వెంటాడుతోందని.. ప్రజలు వైకాపాకు తప్పక బుద్ధిచెబుతారని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బీజాపూర్​లో జవాన్​ వీర మరణం.. గాజులరేగలో బ్లాక్ డే

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తన ఉన్నత అధికారితో పాటు మరో ముగ్గురు జవాన్లను కాపాడే ప్రయత్నంలో.. విజయనగరం గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీశ్‌ ప్రాణాలు విడిచాడు. జగదీశ్‌ మృతితో.. స్నేహితులు, బంధువులు గ్రామంలో బ్లాక్​డే నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఓటర్లకు స్వాగతం.. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు

అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించినట్లే.. ఎన్నికల నిర్వహణ అధికారులు ఓటర్లను ఆకర్షించి.. నూరు శాతం ఓటింగ్ జరిగేలా చూడడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఓటర్లకు పచ్చటి తివాచీతో స్వాగతం పలికేందుకు.. కేంద్ర పాలిత యానం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ చేసిన ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నక్సలైట్ల చెరలో జవాను- భద్రతా దళాల తర్జనభర్జన

బీజాపుర్​ ఎన్​కౌంటర్​ సమయంలో కోబ్రా దళానికి చెందిన ఓ జవానును ఎత్తుకెళ్లామన్న నక్సలైట్ల ప్రకటనలో నిజానిజాలు తేల్చేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • కోచింగ్​ సెంటర్ మూసేశారని విద్యార్థుల విధ్వంసం

బిహార్​లోని సాసారంలో విద్యార్థులు, మరికొందరు ప్రజలు విధ్వంసకాండకు పాల్పడ్డారు. కరోనా నిబంధనల అమల్లో భాగంగా ఓ కోచింగ్ సెంటర్​ను అధికారులు మూయించడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శాంసంగ్ నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు

దేశీయ మార్కెట్లోకి సోమవారం రెండు బడ్జెట్​ స్మార్ట్​ఫోన్లు విడుదల చేసింది శాంసంగ్​. గెలాక్సీ ఎఫ్​ 02ఎస్​, గెలాక్సీ ఎఫ్​ 12 పేర్లతో వీటిని తీసుకొచ్చింది. కొత్త మోడళ్ల ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ ఇద్దరి రాకతో చెన్నై జట్టు మరో స్థాయిలో!

ఇటీవల జట్టుతో చేరిన రైనా, జడేజా గురించి ఆసక్తికర ట్వీట్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్​. వారిద్దరూ ప్రాక్టీస్​ చేస్తున్న ఫొటోను షేర్ చేసిన సీఎస్కే.. 8+3=11.. అని పోస్టు పెట్టింది. ఈ ఐపీఎల్​లో వీరిద్దరూ తమ టీమ్​ను మరో స్థాయికి తీసుకెళ్తారంటూ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సినీ కార్మికులకు ఉచితంగా కరోనా టీకా: చిరు

కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కరోనా టీకా అందించే దిశగా ప్రయత్నాలు చేస్తామని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' ప్రెస్​మీట్​లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details