ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @3PM - టాప్​ న్యూస్

.

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @3PM

By

Published : Feb 21, 2022, 2:57 PM IST

  • మంత్రి గౌతమ్​రెడ్డి మృతిపట్ల.. ప్రముఖుల దిగ్భ్రాంతి
    మంత్రి గౌతమ్​ రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. తొలి నాళ్ల నుంచి సుపరిచితుడైన యువనాయకుడ్ని కోల్పోయానన్న ముఖ్యమంత్రి జగన్.. గౌతమ్ రెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య, తెదేపా అధినేత చంద్రబాబు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు
    మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. అధికార లాంఛనాలతో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బాపు మ్యూజియంలో చేనేత హస్తకళా ప్రదర్శన
    గ్రామీణ ప్రజల చేతి వృత్తులను.. చేనేత వస్త్రాలు, కళాకృతులు ప్రతిబింబిస్తాయి. అంత‌రించిపోతున్న చేతి వృత్తుల‌ను ప్రోత్సహించటంతోపాటు క‌నుమ‌రుగ‌వుతున్న గ్రామీణ క‌ళ‌ల‌ను ప్రజలకు చేరువ చేసేందుకు చేనేత వస్త్ర ప్రదర్శనలు ఎంతగానో తోడ్పడతాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దాణా స్కామ్​ కేసులో లాలూకు ఐదేళ్లు జైలు శిక్ష
    దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్​ యాదవ్​కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా విధించింది రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్​ రేప్.. గోనెసంచిలో శవాన్ని కుక్కి...
    దిల్లీలో ఘోరం జరిగింది. తొమ్మిది రోజుల క్రితం కిడ్నాప్ అయిన బాలిక.. శవమై కనిపించింది. నిందితులు బాలికపై అత్యాచారం చేసి, కిరాతకంగా చంపినట్లు పోలీసులు తెలిపారు. ఒకరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తెలుగు భాషకు పట్టం.. ఆ రాష్ట్రంలోని స్కూళ్లలో బోధన
    మధ్యప్రదేశ్​ స్కూళ్లలో 'అ, ఆ, ఇ, ఈ'లు వినిపించనున్నాయి. తేనెలొలికే తెలుగు పదాలు అక్కడి విద్యార్థులు నోటి వెంట రానున్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్ణయంతో.. మధ్యప్రదేశ్ స్కూళ్లలో త్వరలో తెలుగు బోధించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రోహిత్‌.. తొలి కెప్టెన్​గా సరికొత్త రికార్డు!
    టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టీమ్‌ఇండియా తరఫున మూడు, అంతకన్నా ఎక్కువ సిరీస్‌లు వైట్‌వాష్‌ చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్​తో ఈ ఘనత సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పూరీ పాన్​వరల్డ్​ మూవీ.. రూమర్​ గర్ల్​ఫ్రెండ్​తో హృతిక్​ చిల్​!
    దర్శకుడు పూరీ జగన్నాథ్​ ఓ పాన్ వరల్డ్​ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా, బాలీవుడ్​ స్టార్​ హృతిక్​ రోషన్​ తన రూమర్​ గర్ల్​ఫ్రెండ్​ను ఇంటికి తీసుకెళ్లి కుటుంబసభ్యులతో ఎంజాయ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కన్నవాళ్లు లేకున్నా సడలని సంకల్పం- 'డాక్టర్​' కల సాకారం!
    పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించింది మహారాష్ట్రకు చెందిన శభానా షేక్​. అనాథ అయినప్పటికీ కష్టపడి చదివి ఎంబీబీఎస్ కాలేజీలో సీటు సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సాహా ట్వీట్​పై బీసీసీఐ దర్యాప్తు!
    ఓ జర్నలిస్టు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా చేసిన ఆరోపణలపై బీసీసీఐ స్పందించినట్లు తెలుస్తోంది. దీనిపై బోర్డు సమగ్ర దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details