ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Top News @ 3 PM: ప్రధాన వార్తలు @ 3 PM

ప్రధాన వార్తలు @ 3 PM

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : Aug 29, 2021, 3:00 PM IST

  • కేసీఆర్‌కు లేఖ

వెలిగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదును పునఃపరిశీలించి, ఉపసంహరించుకోవాలని కోరుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు ప్రకాశం జిల్లా తెదేపా ప్రజాప్రతినిధులు లేఖ రాశారు. గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామితో పాటు జిల్లా తెదేపా ప్రజాప్రతినిధులు లేఖపై సంతకాలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకి అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తుందని లేఖలో ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మాతృభాషతోనే సాధ్యం'

తెలుగు వాడుక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం తెలుగువారి సౌభాగ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​​ అన్నారు. గ్రాంథికంలో ఉన్న తెలుగును వాడుక భాషగా మార్చి అందరికీ చేరువయ్యేలా చేసిన ఘనత గిడుగు వంటి మహానుభావులదైతే .. ఈనాటి పాలకులు తెలుగును కనుమరుగు చేసే అనాలోచిత చర్యలకు ఉపక్రమిస్తున్నారన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సీబీఐ విచారణకు ఆదేశించాలి'

ఇసుక దోపిడీపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని తెదేపా నేత పట్టాభి డిమాండ్ చేశారు. ఇసుక దోపిడీలో ఎవరి ప్రమేయముందో విచారణలో తేలుతుందన్నారు. గతంలో సుధాకర్​ ఇన్‌ఫ్రాటెక్‌పై భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారని... అయినప్పటికీ ఆ కంపెనీకే సీఎం జగన్ గోదావరిలో తవ్వకాలకు అనుమతులిచ్చారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ప్రేమే ఉంటే.. పరిశ్రమను కాపాడండి'

రాజధానిని ఉద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని తేల్చిచెప్పారు. రాజధానిని అభివృద్ధి చేసే సత్తా వైకాపాకు లేదని మహిళలు విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఓ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారి బుగ్గలు గిల్లిన ఓ వ్యక్తికి బెయిల్​ మంజూరు చేసింది. ఇలా చేయడం నేరంగా పరిగణించలేమని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులపై నిషేధం(Flight Ban India) పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వీడని కరోనా సమస్యలు

కరోనా మహమ్మారితో(Corona Virus) ఆసుపత్రిపాలైన వారిలో ఏడాది తర్వాత కూడా ఏదో ఒక సమస్య పీడిస్తోందని ఓ అధ్యయనం తేల్చింది. కొందరు రోగులు(Covid patients) కోలుకోవడానికి ఏడాది కన్నా ఎక్కువ సమయం పడుతోందని వెల్లడించింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని మహమ్మారి అనంతరం అందించాల్సిన వైద్య సేవలకు ప్రణాళిక రచించాలని సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'హాలీవుడ్‌ తాలిబన్‌'!

అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయాలతో తాలిబన్లు(Afghan Taliban) మరింత శక్తిమంతులుగా మారారు. ఈసారి వారు ఎక్కడైనా ట్విన్‌ టవర్ల తరహా దాడి చేసినా వారిని అంత తేలిగ్గా అధికారం నుంచి తప్పించలేరు. ఇప్పుడు వారి వద్ద సుమారు 167 హెలికాప్టర్లు, విమానాలు ఉన్నట్లు తేలింది. ఇవి ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ధ్రువీకరించిన లెక్క. ఇక హ్యాంగర్లలో ఉన్న వాటి లెక్క తెలియదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చరిత్ర సృష్టించిన భవీనా..

భారత టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి భవీనా పటేల్​ చరిత్ర సృష్టించింది. టోక్యో పారాలింపిక్స్​లో భారత్​కు తొలి పతకాన్ని అందించింది. పారాలింపిక్స్‌ చరిత్రలోనే టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఆదివారం జరిగిన క్లాస్‌-4 టేబుల్​ టెన్నిస్​ ఫైనల్​ మ్యాచ్​లో చైనా ప్లేయర్​ యింగ్​ ఝోపై 0-3తో ఓడి.. రజతం సొంతం చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నాగ్​ 'ఘోస్ట్​' లుక్

టాలీవుడ్​ కొత్త సినిమాల అప్​డేట్స్​ వచ్చేశాయి. ఆదివారం(ఆగస్టు 29) పుట్టినరోజు (Nagarjuna Birthday) జరుపుకొంటున్న కథానాయకులు అక్కినేని నాగార్జున, విశాల్​ కొత్త సినిమాల టైటిల్స్​తో పాటు ఫస్ట్​లుక్​ అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details