ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @3PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

ప్రధాన వార్తలు

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @3PM

By

Published : Jul 1, 2021, 3:00 PM IST

  • జల వివాదం.. ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం
    కృష్ణా బేసన్​లోని జలాశయాల్లో విద్యుదుత్పత్తి విషయంలో వివాదం ముదిరిన వేళ నాగార్జున సాగర్ వద్ద ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. నాగార్జునసాగర్ జలాశయం వద్ద నిన్నటి నుంచి బలగాలను మోహరించగా.. తాజాగా ఇరు రాష్ట్రాల అధికారులు సాగర్ చేరుకున్న నీటిపారుదలశాఖ అధికారులు.. విజయపురిసౌత్ రివర్ వ్యూ అతిథిగృహంలో సమావేశమయ్యారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'నిరుద్యోగులను సీఎం జగన్‌ నిండా ముంచారు'
    ఉద్యోగాల భర్తీపై పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు చేయకపోతే.. సీఎం జగన్‌ జాదూ రెడ్డిగా చరిత్రలో మిగిలిపోతారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. 'జాబ్ లెస్ క్యాలెండర్‌తో నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయం- భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ' అనే అంశంపై లోకేశ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆరేళ్లైనా ఇంకా నిరాశ్రయులగానే హుద్‌హుద్‌ బాధితులు
    హుద్‌హుద్‌ తుపాను కారణంగా నిరాశ్రయులైన వారికి ఆదుకునేందుకు ఇళ్లు నిర్మించినా..అవి ఇంకా లబ్ధిదారులకు అందలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా..మరికొన్ని చోట్ల అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఇళ్ల చుట్టూ తుప్పలు పెరిగి.. పాములు, దోమలకు నిలయంగా మారిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దేశవ్యాప్తంగా ట్విట్టర్​ సేవలకు అంతరాయం!
    సామాజిక మాధ్యమం ట్విట్టర్ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. ట్వీట్ షేరింగ్, సెర్చింగ్​లో సమస్య తలెత్తినట్లు వినియోగదారులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఫిరాయింపులపై పార్లమెంటుకే పూర్తి అధికారాలు'
    ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల కేసుల్లో నిర్ణయం తీసుకునేందుకు ఒకే విధానం ఉండాలంటూ దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అది పార్లమెంటు పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జైలు నుంచి అసెంబ్లీకి.. అచ్చం సినిమాలానే...
    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉందనే అభియోగాలతో అరెస్టైన అసోం ఎమ్మెల్యే అఖిల్​ గొగొయి విడుదల కానున్నారు. గొగొయిపై ఉన్న రెండు కేసులను కొట్టివేసింది ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు. ఆయనతో పాటు మరో ముగ్గురికి విముక్తి లభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమెరికాలో భారీ బ్లాస్ట్​- ఒకేసారి 2 టన్నుల బాంబులు​...
    2 వేల కిలోల చైనా బాంబులు పేలిన ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. సమీపంలోని ఇళ్లు, కార్లు దెబ్బతిన్నాయి. అమెరికా లాస్​ ఏంజెలెస్​లో ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన బాణసంచాను పోలీసులు స్వాధీనం చేసుకుని, నిర్వీర్యం చేసేందుకు తరలిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉద్యోగం చేయకుండానే లక్షల జీతం.. ఎలా?
    ఏ సంస్థలోనూ ఉద్యోగం చేయకుండానే డబ్బులు సంపాదించవచ్చా? రానున్న రోజుల్లో అది ఒక కేరీర్​గా మారనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు ఈ అమ్మాయే నిదర్శనం. మైక్రోసాఫ్ట్​లో ఉద్యోగం చేయకుండానే.. సంస్థ నుంచి 30వేల డాలర్లు(రూ.22 లక్షలు) పారితోషికం తీసుకుంది. మరి ఆ యువతి చేసిన పనేంటి? అంత మొత్తం ఎందుకు చెల్లించారు?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఖేల్​రత్న రేసులో శ్రీకాంత్, సాయి ప్రణీత్​
    బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), సాయి ప్రణీత్(Sai Praneeth) పేర్లను ఖేల్​రత్న(Khel Ratna) పురస్కారానికి సిఫార్సు చేసింది భారత బ్యాడ్మింటన్ సంఘం(BAI). అలాగే అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్​చంద్ అవార్డుల కోసం పేర్లను ప్రతిపాదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Doctors Day: మనిషి రూపంలో ఉన్న దేవుడు.. వైద్యుడు
    వైద్యుల దినోత్సవం(Doctors Day) సందర్భంగా వారి కృషిని మెచ్చుకుంటూ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ట్వీట్ చేశారు. 'మనిషి రూపంలో ఉన్న దేవుళ్లు వాళ్లు' అంటూ రాసుకొచ్చారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details