అలా చేసి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవి
"తెదేపాలో 33శాతం పదవులు 35ఏళ్ల లోపు వారికే"
తెదేపా బలోపేతానికి యువనాయకత్వం అవసరమని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. సీనియర్ల అనుభవం, యువతరం ఉత్సాహం రెండూ పార్టీ పురోగతికి మరింతగా దోహదపడాలని పిలుపునిచ్చారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో యువతకే పెద్దపీట వేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అనుబంధ సంఘాల బలోపేతంపై యువ నాయకత్వం చొరవ తీసుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. గత 5ఏళ్లలో రాష్ట్రాభివృద్ది, సంక్షేమంపై దృష్టి పెట్టామే తప్ప ఓట్లు రాబట్టడంపై శ్రద్ద పెట్టలేదని ఆయన అన్నారు. ఓట్లు రాబట్టడంపై మరింత శ్రద్ద పెట్టివుంటే ఫలితాలు వేరేగా ఉండేవని అభిప్రాయపడ్డారు. యువ నాయకులు క్షేత్ర పర్యటనలపై శ్రద్ధ చూపాలన్నారు. పార్టీలో పోరాట పటిమ పెంచే బాధ్యత యువ నాయకత్వంపైనే ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తలకు, శ్రేణులకు యువ నాయకత్వం మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు.