రెమ్డెసివిర్ ఇంజక్షన్లతో బాక్ల్ మార్కెట్ దందాకు పాల్పడుతోన్న ముగ్గురు సభ్యుల ముఠాను తెలంగాణలోని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయాల్లో అందించే రెమ్డెసివిర్ ఇంజక్షన్లను.. ఎంఆర్పీ కన్నా అత్యధిక ధరలతో అమ్ముతున్న ఈ ముఠాను వరంగల్ టాస్క్ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్చేశారు. వీరి నుంచి 28 ఇంజక్షన్లతో పాటు రూ. 20వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఎక్కువ మంది బాధితులు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి తెలిపారు. కరోనా చికిత్సలో భాగంగా అత్యవసర సమయంలో అందించే రెమ్డెసివిర్ ఇంజక్షన్ల వినియోగం ఎక్కువ అయిందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో.. ఇదే అదునుగా భావించి స్థానిక ఆసుపత్రులు, మెడికల్ షాపుల వారు బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని స్పష్టం చేశారు.