ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో 16 ఏళ్ల బాలిక హత్య.. అనుమానితుడి గుర్తింపు - crime news today

తెలంగాణలోని చిలకలగూడ వారాసిగూడలో రాత్రి తన ఇంటి భవనంపై చదువుకుంటున్న 16 ఏళ్ల బాలికను ఎవరో గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో బాలిక దారుణ హత్య
తెలంగాణలో బాలిక దారుణ హత్య

By

Published : Jan 24, 2020, 2:06 PM IST

తెలంగాణలో బాలిక దారుణ హత్య

సికింద్రాబాద్​ చిలకలగూడ పీఎస్​ పరిధిలో దారుణం జరిగింది. ఆరిఫా అనే 16 ఏళ్ల బాలికను దుండగులు హత్య చేశారు. బాలిక నివాసం ఉంటున్న భవనంపై పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్​ టీం ఆధారాలు సేకరించింది. రాత్రి బాలిక భవనంపై చదువుకున్నట్లు బాలిక బంధువులు తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.

నిందితుడు అతనేనా..?

బాలికను అతడే చంపాడంటున్న బంధువులు

రాత్రి బాలిక భవనంపై చదువుకుంటున్న సమయంలో ఎవరో ఆమెను రాయితో కొట్టి కింద పడేశారని బంధువులు చెబుతున్నారు. ఆరిఫాను షోయబ్​అనే యువకుడు కొంతకాలంగా వేధిస్తున్నాడని.. అతనే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవీ చూడండి:

దావోస్​లో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం

ABOUT THE AUTHOR

...view details