ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: పదివేలు దాటిన కొవిడ్ కేసులు...52మంది మృతి - తెలంగాణలో కరోనా కొత్త కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్క రోజే కొవిడ్‌తో చికిత్స పొందుతూ 52 మంది ప్రాణాలు కోల్పోయారు.

covid cases in Telangana
covid cases in Telangana

By

Published : Apr 27, 2021, 11:28 AM IST

తెలంగాణలో కరోనా మహోగ్రరూపం దాల్చింది. ఒక్కరోజే అత్యధికంగా 10,122 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఏకంగా 52 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. కరోనా మొదలైన నాటి నుంచి తెలంగాణలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. జిల్లాల్లోనూ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ప్రస్తుతం 69,221 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్​ నుంచి కోలుకుని మరో 6,446 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో గడిచిన24 గంటల్లో 99,638 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details