ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పసివాడికి వైద్యం చేయించేందుకు 100 కిలోమీటర్ల నడక

అనారోగ్యంతో బాధపడుతున్న కన్నపేగును బతికించుకునేందుకు.. ఆ తల్లిదండ్రులు ఏకంగా 100 కిలో మీటర్లు నడిచారు. లాక్ డౌన్ కారణంగా వాహనాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ దుస్థితి తలెత్తింది.

100KM WALK FOR HIS SON
100KM WALK FOR HIS SON

By

Published : May 13, 2020, 4:42 PM IST

నాలుగు నెలల బాలుడికి వైద్యం నిమిత్తం ఓ కుటుంబం రానుపోను దాదాపు 100 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారం చింతపట్లకు చెందిన దంపతులు శ్రీశైలం, మానస.. తమ కుమారుడు మల్లికార్జున్‌ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆందోళన చెందారు. కాలినడకన నల్గొండ జిల్లాలోని ఓ వైద్యకేంద్రంలో చూపించారు.

ఎన్ని ఆస్పత్రులు తిరిగినా బాలుడికి వాంతులు, నోటి నురగలు తగ్గని కారణంగా.. యాచారం నుంచి నగరానికి (సుమారు 50 కిలోమీటర్లు) నడిచి వచ్చి సోమవారం ఆర్కేపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. వారి వెంట కూతురు కూడా ఉంది. మంగళవారం మళ్లీ కాలినడకనే ఇంటికి బయల్దేరారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details