జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ...వైఎస్ విజయమ్మ కర్నూలు జిల్లా డోన్‌లో రోడ్ షో నిర్వహించారు. రాజన్న రాజ్యం జగన్‌తో మాత్రమే సాధ్యమని ఆమె అన్నారు. నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలను గెలిపించాల్సిందిగా విజయమ్మ ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్ర అభివృద్ధి బాట పట్టాలంటే జగన్ రావాలి..కావాలి అన్నారు. నెరవేర్చని హామీలతో మళ్లీ చంద్రబాబు..ప్రజల ముందుకు వచ్చారన్న ఆమె...తెదేపా పాలనలో డోన్‌లో ఒక్క అభివృద్ధి పని జరగలేదని విమర్శించారు. డోన్ పట్టణ వాసుల కోసం ఏర్పాటు చేసిన జీడీపీ నీటి సదుపాయం, ఉపరితల వంతెనలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలోనే జరిగాయని గుర్తుచేశారు.
జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి: విజయమ్మ - జగన్
"రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యం. నా బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి...రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడు. రాజశేఖర్ రెడ్డి హయంలో జరిగిన అభివృద్ధే మళ్లీ కావాలంటే వైకాపాను గెలిపించండి "--వైఎస్ విజయమ్మ, వైకాపా గౌరవ అధ్యక్షురాలు
వైఎస్ విజయమ్మ
ఇవీ చూడండి :ఎన్నికలకు సిద్ధం.. అర్హులు స్వేచ్ఛగా ఓటేయాలి!