ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'దోషులకు కఠిన శిక్ష పడాలి'-ఐరాస

పుల్వామా ఉగ్రదాడిపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.

Breaking News

By

Published : Feb 15, 2019, 6:46 AM IST

జమ్ముకశ్మీర్​లో జరిగిన ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించింది ఐక్యరాజ్యసమితి(ఐరాస). మృతుల కుటుంబాలకు తమ సంతాపం ప్రకటించారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దాడి వెనుక ఉన్న వారిని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వెల్లడించారు.

''ఇది భారతదేశానికి తగిలిన అతిపెద్ద గాయంగా భావిస్తున్నాం. భారత ప్రభుత్వం, దేశ ప్రజలు త్వరగా ఈ బాధ నుంచి తేరుకోవాలి. ఈ దురాగతానికి పాల్పడ్డ వారికి కఠిన శిక్ష పడాలి''
- ఐరాస ప్రకటన

ABOUT THE AUTHOR

...view details