ఉత్తరప్రదేశ్లో 'కుంభమేళా' ఘనంగా జరుగుతోంది. వసంతపంచమి సందర్భంగా రేపు జరగనున్న 'మూడో షాహీ' స్నానాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్రాజ్ వద్ద పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారని అంచనా.
తీవ్రవాద ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. ఇందు కోసం కేంద్ర బలగాలు, 20 వేల మంది పోలీసులు, ఆరువేల మంది హోంగార్డులు, 80 కంపెనీల పారామిలటరీ దళాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 40 పోలీసు స్టేషన్లు, 40 అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పుణ్య నదీ సంగమ 'షాహీ' స్నానాలు
45 రోజులపాటు జరిగే కుంభమేళాలో మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 15న మొదటిసారి షాహీ స్నానాలు ఆచరించారు. అనంతరం మౌనీ అమావాస్య సందర్భంగా ఫిబ్రవరి 4న రెండో షాహీ స్నానాలు జరిగాయి. వసంతి పంచమి సందర్భంగా రేపు మూడో షాహీ స్నానాలు చేస్తా.
ఈ విధంగా గంగ, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో మూడు సార్లు 'షాహీ' స్నానాలు ఆచరించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.