రాష్ట్రంలో గడచిన నెలరోజులుగా నిలిచిపోయిన పాలనా పరమైన అంశాలపై సీఎస్ ఆద్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ ఎన్నికలతో సంబంధంలేని అంశాల్లో ముందుకు వెళ్లాల్సిందిగా సూచనలు చేసింది. వచ్చే వ్యవసాయ సీజన్ కు రైతులకు జారీ చేయాల్సిన ఎరువులపై నిర్ణయం తీసుకుని వ్యవసాయ శాఖకు ఆమేరకు అనుమతులు ఇచ్చింది. వైద్యశాఖలో 292 అంబులెన్సుల కొనుగోలుకు సంబంధించి తదుపరి కార్యాచరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 238 మంది డిప్యూటీ తహసిల్దార్ ల నియామకానికి కూడా అనుమతులు జారీ చేశారు. రాష్ట్రంలో 813 మంది పోలీసు కానిస్టేబుళ్ల పదోన్నతులకు సంబందించి నిర్ణయం తీసుకున్నారు.
ప్రజాసమస్యలు పరిష్కరించండి : సీఎస్ - lv subramanyam
పాలనపరమైన అంశాలపై విజయవాడ వేదికగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్లో ఉన్నఅంశాలపై ప్రత్యేకంగా సమీక్షించి వాటికి తక్షణమే అనుమతులు మంజూరు చేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం వంటి అంశాలపై కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు.
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
Last Updated : Apr 25, 2019, 5:04 AM IST