చల్లని కబురు.. ఈ నెల 29 వరకు తేలికపాటి జల్లులు - రాష్ట్రంలో మే 29 వరకు తేలికపాటి జల్లులు
ఎండవేడికి ప్రజలు భయపడుతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టేందుకు గాబరా పడుతున్నారు. అయితే ఆర్టీజీఎస్ ప్రజలకు కాస్త ఊరటనిచ్చే సమాచారం అందించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది.
rain
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని ఆర్టీజీఎస్ తెలిపింది. ఈ నెల 29 వరకు మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు చెప్పింది. అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. పశ్చిమ గోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయని ఆర్టీజీఎస్ సమాచారం ఇచ్చింది.
TAGGED:
rtgs