ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసిన ఎన్నికల సిబ్బంది

ఎన్నికల నిర్వహణ సిబ్బంది కోసం కృష్ణా జిల్లా మైలవరంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. రేపట్నుంచి నాలుగు రోజుల పాటు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

By

Published : Apr 1, 2019, 10:46 PM IST

ఎన్నికల నిర్వహణ సిబ్బంది కోసం పోస్టల్ బ్యాలెట్

ఎన్నికల నిర్వహణ సిబ్బంది కోసం పోస్టల్ బ్యాలెట్
కృష్ణా జిల్లా మైలవరంలో ఎన్నికల నిర్వహణ సిబ్బంది కోసం పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు. మైలవరం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో సిబ్బంది వచ్చారు. ఒక్క బూత్ ఏర్పాటు చేయడం వలన సిబ్బంది గంటల పాటు లైన్​లో నిలబడి ఓటు వేశారు.

ఈ నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికలలో పాల్గొనే సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ సదుపాయం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ మంది సిబ్బంది రావడం వలన పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని రేపట్నుంచినాలుగో తేదీ వరకూ మైలవరం రెవెన్యూ కార్యాలయంలో...5వ తేదీన తిరిగి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తామని తెలిపారు.

ఎన్నికల నిర్వహణ సిబ్బందికి టైనింగ్ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రత్యేక తహసిల్దార్ అప్పారావు తెలిపారు. సుమారు 1400 మందికి ఈవీఎమ్​ల నిర్వహణపై శిక్షణ ఇచ్చామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ నిర్వహిస్తున్నట్లు అప్పారావు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి 'జనసేనను చూసి చంద్రబాబు, జగన్ భయపడుతున్నారు'

ABOUT THE AUTHOR

...view details