ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'ప్రభుత్వాసుపత్రిలో పెద్ద ఆపరేషన్​కు రూ. 5 వేలు..!' - ap hospitals

అదో ప్రభుత్వాసుపత్రి. అక్కడ ఏ సేవలకైనా రోగులు డబ్బులు చెల్లించాల్సిందే. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకైతే 3 వేలు.. సిజేరియన్​కైతే 5వేల రూపాయలు డిమాండ్​ చేస్తున్నారు. సౌకర్యాలకు దూరంగా ఉన్నా... లంచాలకు మాత్రం గేటు తెరిచి చూస్తోంది కడప జిల్లాలోని ఓ ​ఆరోగ్య సంరక్షణ కేంద్రం.

'ప్రభుత్వాసుపత్రిలో పెద్ద ఆపరేషన్​కు 5 వేలా..!'

By

Published : Jun 12, 2019, 1:01 PM IST

Updated : Jun 12, 2019, 1:22 PM IST


ఆ ప్రభుత్వాసుపత్రిలో సేవలకో రేటు. 'పెద్దఆపరేషన్​కైతే ఇంత.. కుటుంబ నియంత్రణకు అంత' అంటూ సంభాషణలు వినిపిస్తూనే ఉంటాయి. గవర్నమెంట్​ దవఖానాలో ఏంటీ పరిస్థితి..! అని ప్రజలు వాపోతున్నారు. ఉచితంగా వైద్యం చేయాల్సిన వైద్యులే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు రోగులు. ఇవన్నీ వింటుంటే అసలు ఇది నిజంగా గవర్నమెంట్​ దవఖానేనా..? అనిపిస్తుంది కదూ..!. అవును...ఇదీ కడప జిల్లా బద్వేలు సమగ్ర ప్రసూతి- శిశు ఆరోగ్యం కేంద్రంలో దుస్థితి.

ప్రభుత్వాసుపత్రిలో లంచాలు..!
ఈ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు విధుల్లో ఉన్నా... అందుబాటులో ఉండేది మాత్రం అప్పుడప్పుడే. ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయడం కంటే ప్రైవేట్​ ప్రాక్టీసులో బాగా సంపాదిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే... కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
ఆసుపత్రిలో తాము ఎవర్నీ డబ్బులిమ్మని డిమాండ్​ చేయడం లేదని వైద్యాధికారి ఖాదర్​ అయ్యా అన్నారు. కింది స్థాయి ఉద్యోగులే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు.
Last Updated : Jun 12, 2019, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details