ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

బెంగళూరు టు నెల్లూరు... అక్రమ గుట్కా గుట్టు రట్టు - nellore

నెల్లూరులో అక్రమంగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లు తెచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 39 వేల 600 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరు టూ నెల్లూరు...అక్రమ గుట్కా గుట్టు రట్టు

By

Published : Apr 17, 2019, 7:02 PM IST

బెంగళూరు టూ నెల్లూరు...అక్రమ గుట్కా గుట్టు రట్టు

నెల్లూరు నగరంలో అక్రమంగా గుట్కా వ్యాపారం చేస్తున్న వారిపై పోలీసులు దాడులు చేశారు. నగరంలోని పప్పులవీధిలో తనిఖీలు చేసిన సీసీఎస్ పోలీసులు... 3 లక్షల 87 వేల రూపాయల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన శ్రీనివాసులు అనే వ్యాపారి బెంగళూరు నుంచి నిషేధిత గుట్కా, ఖైనీలు తెచ్చి అక్రమంగా వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో 39 వేల 600 ప్యాకెట్ల నిషేధిత గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు... వ్యాపారి శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details