నేడు పార్లమెంటులో 'అటల్ జీ' చిత్రపటం ఆవిష్కరణ - పార్లమెంట్లో వాజ్పేయీ
నేడు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మాజీ ప్రధాని, భాజపా దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయీ చిత్రపటాన్ని ఆవిష్కరించనున్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
నేడు పార్లమెంటులో 'అటల్ జీ'చిత్తరువు ఆవిష్కరణ
వాజ్పేయీ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగారు. 1996లో మొట్టమొదటి సారి ప్రధాని పదవి చేపట్టి 13 రోజులు అధికారంలో ఉన్నారు. రెండోసారి 1998-1999 మధ్య 13 నెలలపాటు, మూడోసారి 1999 నుంచి 2004 వరకు ప్రధాని పదవిలో కొనసాగారు.
సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడిన ఆయన గతేడాది ఆగస్టు 16న కన్నుమూశారు.