మోదీ ప్రసంగం - అబద్ధాల దుకాణం: కాంగ్రెస్ - కాంగ్రెస్
పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది.
రణ్‌దీప్ సుర్జేవాలా
"సభలో ఎప్పటిలాగే మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. మాట్లాడటం మినహా ఈ ఐదేళ్లలో ఆయన చేసిందేమీ లేదు. ఆయన ప్రధానమంత్రి కాదు. అసత్యాల ప్రచార మంత్రి. 70 ఏళ్లలో భారత్‌కు దొరికిన మొదటి ప్రచార మంత్రి మోదీనే. ప్రధానిని పనికిరాని కరెన్సీగా ప్రజలు పక్కన పెట్టారు. మోదీవన్నీ తప్పుడు, కల్పిత కథలే. ఆయనదొక అబద్దాల దుకాణం. ఎన్నికలకు 60 రోజులు కూడా లేవు. ఇప్పటికైనా ఆయన నిజాలు మాట్లాడితే ప్రజలు క్షమిస్తారు. "
- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
Last Updated : Feb 8, 2019, 7:29 AM IST