ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మోదీ హామీనా మజాకా.!

మోదీ హామీపై వచ్చిన ఓ తప్పుడు వార్త బిహార్​లోని ఓ గ్రామస్థులను అవస్థల పాలు చేసింది.

మోదీ హామీపై తప్పుడు వార్త ప్రభావం

By

Published : Feb 8, 2019, 5:17 PM IST

Updated : Feb 8, 2019, 6:22 PM IST

ప్రభుత్వ స్థాపన అనంతరం ప్రతిఒక్కరి ఖాతాలో 10లక్షల రూపాయలు జమ చేస్తామన్న మోదీ హామీ గుర్తుందా? ఆ మాటలను ప్రజలు మర్చిపోయి చాలా రోజులు అవుతోందంటారా? కానీ అదే హామీ ఇప్పుడు ఒక గ్రామాన్ని కుదిపేస్తోంది.

మోదీ హామీపై తప్పుడు వార్త ప్రభావం

బిహార్​ మోతీహారీ గ్రామంలోని పోస్ట్​ ఆఫీసు ఎదుట గ్రామస్థులు పడిగాపులు కాస్తున్నారు. ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి ఖాతాలోను 25 వేల నుంచి 15 లక్షల వరకు జమ చేస్తున్నారని వార్త రావడమే దీనికి కారణం. అసలే పేదరికం. ఇక ఇలాంటి వార్త వినిపిస్తే జనం ఊరుకుంటారా.. వెనకా ముందూ ఆలోచించకుండా ఉరకులు వేసుకొని తపాలా బ్యాంకు ఖాతాలు తెరవడానికి తపాల కార్యాలయానికి పరిగెడుతున్నారు.

ఊహాగానాలను నమ్మి...

పెద్ద పెద్ద క్యూలలో మహిళలు, పురుషులు బారులు తీరుతున్నారు. ఖాతా తెరవడానికి గ్రామస్థులు పోటీపడుతున్నారు.

గ్రామస్థుడు: డబ్బులు పంపడానికి ఖాతాలు తెరవమని మోదీ చెప్పారు.
ప్ర: అందుకే మీరు ఇక్కడికి వచ్చారా?
స:- అవును అందుకే వచ్చాము.
ప్ర: ఎంత సొమ్ము పంపుతామని అన్నారు?
స:- 25వేలు అని అంటున్నారు.

ఈ ఊహాగానాలను నమ్మిన ప్రజలు ఆకలిని సైతం లెక్కచేయకుండా పోస్ట్​ ఆఫీసు బయట అవస్థలు పడుతున్నారు. చిన్నారులను భుజాలపై మోసుకుని మరీ క్యూలల్లో కుస్తీపడుతున్నారు. చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా... గొడవలకు అంతులేకుండా పోతోంది.

ఇలాంటి ప్రచారం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో సర్వసాధారణమైపోయింది.

Last Updated : Feb 8, 2019, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details