తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లిలో కొలువైన శ్రీ బాల బాలాజీ స్వామి వారి దివ్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి కల్యాణం జరిపారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి కనులారా వీక్షించారు. స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో వైభవంగా స్వామివారి కల్యాణం జరిగింది.
వైభవంగా శ్రీ బాలబాలాజీ స్వామి కల్యాణం - east godavari
అప్పనపల్లిలో కొలువై ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామి వారి కల్యాణాన్ని కన్నుల పండువగా జరిగింది. గురువారం రాత్రి నిర్వహించిన కార్యక్రమాన్నివీక్షించేందుకు భక్తులు పోటెత్తారు.
వైభవంగా శ్రీబాలబాలాజీ స్వామి కల్యాణం