కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఈదుల దేవరబండ విద్యుత్తు ఉప కేంద్రం వద్ద కప్పట్రాళ్ల గ్రామస్థులు ధర్నా చేపట్టారు. గత పది రోజులుగా గ్రామంలో విద్యుత్తు సరఫరా సరిగా లేదని రోడ్డుపై బైఠాయించారు. పంటలకు నీరు అందడం లేదని వాపోయారు. సమస్యను పరిష్కరించాలని పదేపదే విన్నవించుకున్నా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. గ్రామస్థుల ధర్నాతో కర్నూలు - బళ్లారి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
10 రోజులుగా విద్యుత్ లేదు.. ఎవరూ పట్టించుకోరా? - విద్యుత్ కోతలు
గత పది రోజులుగా తమ గ్రామానికి విద్యుత్తు సరఫరా లేదని కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈదులదేవరబండ ఉపకేంద్రం వద్ద ధర్నాచేపట్టారు.
విద్యుత్తు కోతలపై గ్రామస్థుల ధర్నా