ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ డీజీని తప్పించడం సంఘ విద్రోహ శక్తులకు ఊతమివ్వడం కాదా? అని మంత్రి కళా వెంకట్రావు జగన్‌ను బహిరంగ లేఖలో ప్రశ్నించారు.
జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ
వివేకా హత్యలో విషయంలో బండారం బయటపడుతుందనే... సిట్ విచారణ వివరాలు బహిర్గతం చేయొద్దని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారని కళా వెంకట్రావు ఆరోపించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో జగన్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.
లేఖలోని ముఖ్యాంశాలు...
⦁ కుటుంబంలో హత్య జరిగితే విచారణ వేగంగా జరగాలని, దోషులకు శిక్ష పడాలని కోరుతారు. కానీ జగన్ మాత్రం విచారణ అధికారులను తప్పించి తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు.
⦁ వివేకా హత్య కేసులో జగన్బండారం బయటపడుతుందనే విచారణ వివరాలు బహిర్గతం చేయొద్దని హైకోర్టులో పిటిషన్ వేయలేదా..?
⦁ హోదా ఇస్తే పరిశ్రమలు ఏపీకి వెళ్తాయని కేసీఆర్ అండ్ కో అన్నారు. అలాంటి తెరాస నేతలు ఏపీకి హోదా రానిస్తారా?
⦁ జగన్‌కు జన్మభూమి కంటే కేసీఆర్ ప్రగతిభవనే ముఖ్యమా?..అవినీతి సొమ్ము కోసం కేసీఆర్‌కు రెడ్‌కార్పెట్ వేయడం స్వార్థం కాదా?
⦁ మీ బెదిరింపులకు లొంగని నేతలపై ఐటీ దాడులు నిజం కాదా? అని కళా వెంకట్రావు జగన్‌ను ప్రశ్నించారు.
⦁ కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటని తన బంధాన్ని జగన్ బయటపెట్టారు. మోదీతో బంధాన్నీ బహిర్గతం చేసి రెండో ముసుగు తొలగించాలని డిమాండ్ చేశారు.
⦁ అధికారులను బదిలీ చేయాలని లేఖ రాయడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్ కోరిన వెంటనే బదిలీ చేశారంటే వారిబంధం ఎలా ఉందో అర్థం అవుతుందని ఆక్షేపించారు.